నాగార్జున యూనివర్సిటీ ప్రత్యేక పోస్టల్ స్టాంప్ ఆవిష్కరణ
రిపోర్టర్: అశోక్
స్థలం: అమరావతి
అమరావతిలోని సచివాలయంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురువారం ఆవిష్కరించారు. విశ్వవిద్యాలయం 50 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ స్టాంప్‌ను రూపొందించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి శ్యామలరావు, వీసీ కే.గంగాధర రావు తదితరులు పాల్గొన్నారు.