కేంద్ర హోంమంత్రితో జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా భేటీ
రిపోర్టర్: అశోక్
స్థలం: New Delhi, India
జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి తక్షణమే పూర్తిస్థాయి హోదాను పునరుద్ధరించాలని, పాలనాపరమైన నిబంధనలను ఖరారు చేయాలని ఆయన కోరారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఏర్పడిన పరిపాలనా ఇబ్బందులను తొలగించి, ప్రజా సంక్షేమం, అభివృద్ధిపై చర్చించారు. ఈ భేటీ జమ్మూ కశ్మీర్ రాజకీయ భవిష్యత్తుకు అత్యంత కీలకంగా మారింది.