స్వర్ణభారత్ ట్రస్ట్ సేవలు దేశానికే ఆదర్శం: సీఎం యోగి ఆదిత్యనాథ్

రిపోర్టర్: నరేష్ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. పేద పిల్లలకు విద్య, నైపుణ్య శిక్షణ అందిస్తూ ట్రస్ట్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. అందరికీ వందనం అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించి సభికులను ఆకట్టుకున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంకల్పంతో ఈ ట్రస్ట్ గొప్ప సేవలు అందిస్తోందని కొనియాడారు.