స్థానిక ఎన్నికల వేళ వైసీపీ కుట్రలను తిప్పికొట్టాలని చంద్రబాబు పిలుపు
రిపోర్టర్: సతీష్
స్థలం: అమరావతి
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతోనే ప్రతిపక్ష వైసీపీ రాష్ట్రంలో కావాలనే ఉద్రిక్తతలు సృష్టిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అమరావతిలో కూటమి నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజకీయ లబ్ధికోసమే నామినేషన్ కేంద్రాల వద్ద గొడవలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ కుట్రలను శ్రేణులు తిప్పికొట్టాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినంగా వ్యవహరించాలని పోలీస్ యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు.