అరసవల్లి ఆలయంలో సూర్యకిరణాల స్పర్శకు అంతరాయం అంటూ ప్రధాన అర్చకులు వెల్లడి

రిపోర్టర్: సునీల్ స్థలం: శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో అరుదైన దృశ్యానికి వాతావరణ మార్పుల కారణంగా అంతరాయం ఏర్పడిందని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ వెల్లడించారు. ఏటా అక్టోబర్ ఒకటి, రెండు తేదీల్లో సూర్య భగవానుడి లేలేత కిరణాలు గర్భగుడిలోని మూలవిరాట్ను తాకడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. అయితే వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల ఇవాళ సూర్యకిరణాలు స్వామివారిని తాకలేదని పేర్కొన్నారు. భక్తులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, రేపు సూర్యకిరణాలు మూలవిరాట్ను తాకే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.