వేటకు వెళ్లని మత్స్యకారులకు ఉచితంగా బియ్యం అందించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
రిపోర్టర్: శివ
స్థలం: అమరావతి
తీవ్ర వాయుగుండం కారణంగా సముద్రంలో వేటకు వెళ్లలేకపోయిన మత్స్యకారుల కుటుంబాలకు ఐదు కిలోల చొప్పున ఉచితంగా బియ్యం అందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో వరద పరిస్థితులపై శనివారం ఆయన విదేశాల నుంచి సీఎస్ సాయిప్రసాద్, అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జలమయమైన నివాస ప్రాంతాలు, నీట మునిగిన పంటలు, రిజర్వాయర్లకు నీటి ప్రవాహాల తీరును అధికారులు ఈ సందర్భంగా వివరించారు. కాకినాడ నుంచి చేపల వేటకు వెళ్లిన తొమ్మిది మంది మత్స్యకారులు సురక్షితంగా ఒడిశా చేరారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.