చిలకలూరిపేటలో ఎస్పీ జగదీష్ ఆకస్మిక తనిఖీలు: పోలీస్ స్టేషన్ రికార్డుల పరిశీలన

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: పల్నాడు

రానున్న ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడమే లక్ష్యంగా చిలకలూరిపేటలోని పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ జగదీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా స్టేషన్ల రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెంచి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆయన స్పష్టం చేశారు.