విశాఖలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు: నగర పోలీసుల కీలక హెచ్చరికలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: విశాఖపట్నం

విశాఖపట్నంలోని విజ్ఞాన్స్ వరల్డ్ వన్ స్కూల్లో సైబర్ క్రైమ్ సవాళ్లు అంశంపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు VizagCityPolice వెల్లడించారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేవైసీ మోసాలు, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, డిజిటల్ అరెస్ట్ స్కామ్లపై విద్యార్థులు, తల్లిదండ్రులకు విస్తృతంగా అవగాహన కల్పించారు. ఆన్లైన్ భద్రతను పాటించాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉంటూ తక్షణమే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.