మున్సిపల్ ఎన్నికల అక్రమాలపై ఎస్ఈసీ పునేఠాకు వైకాపా నాయకుల ఫిర్యాదు
రిపోర్టర్: మహేష్
స్థలం: విజయవాడ
మున్సిపల్ ఎన్నికల్ లో జరిగిన అక్రమాలపై ఆధారాలతో ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం మొక్కుబడిగా రీపోలింగ్ నిర్వహించిందని వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాను వైకాపా నేతలు సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. పులివెందులలో వైకాపా ఏజెంట్లను బయటకు పంపి రిగ్గింగ్ కు పాల్పడ్డారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవిష్యత్తు ఎన్నికల్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వెబ్‌క్యాస్టింగ్ ద్వారా పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు.