హైదరాబాద్ లో గుట్టురట్టు: అక్రమ అండాల విక్రయాల రాకెట్ భేధించిన పోలీసులు
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో నిరుపేద మహిళలను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న అక్రమ అండాల విక్రయాల హ్యూమన్ ట్రాఫికింగ్ నెట్వర్క్ను మల్కాజిగిరి పోలీసులు విజయవంతంగా ఛేదించినట్లు సీపీ సుమతి తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అమాయక యువతులను హాస్టళ్లలో ఉంచి అక్రమ దందా సాగిస్తున్నారని, బాధిత మహిళలకు ప్రమాదకర హార్మోనల్ ఇంజెక్షన్లు ఇస్తూ వారి ఆరోగ్యంతో నిందితులు చెలగాటమాడారని ఆమె పేర్కొన్నారు. ఈ దందాతో సంబంధం ఉన్న ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసి, నలభై తొమ్మిది మంది మహిళలను రక్షించినట్లు పోలీసులు స్పష్టం చేశారు.