ముంబై నిరసనలపై ఇమ్రాన్ ఖాన్ కు బాంబే హైకోర్టు మొట్టికాయలు

రిపోర్టర్: రమేష్ స్థలం: ముంబై

ఓసీఐ నిబంధనలను ఉల్లంఘించి నిరసనల్ లో పాల్గొన్న నటుడు ఇమ్రాన్ ఖాన్ పై బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలను అతిక్రమించి ఆందోళనల్ లో పాల్గొనడంపై బేషరతు క్షమాపణ చెప్పాలని నటుడిని ఆదేశించింది. విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం జారీ చేసిన నోటీసుపై మధ్యంతర స్టేను డిసెంబర్ ఏడో తేదీ వరకు పొడిగిస్తూ, విదేశీ పౌరులు దేశంలో రాజకీయ నిరసనల్ లో భాగస్వామ్యం కాకూడదని కోర్టు స్పష్టం చేసినట్లు అధికారులు తెలిపారు.