పులివెందులలో రీపోలింగ్ నిర్వహించాలంటూ ఆర్వో కార్యాలయం ఎదుట జగన్ బైఠాయింపు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: పులివెందుల

పులివెందులలో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆర్వో కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ బైఠాయించారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అధికారులు ఒత్తిళ్లకు తలవంచకుండా రీపోలింగ్ జరిపించాలని, లేదంటే ఇక్కడే నిరసన కొనసాగిస్తామని జగన్ హెచ్చరించారు.