మున్సిపల్ ఎన్నికల్ లో కనిష్ట పోలింగ్: ఆందోళనలో అధికార కూటమి నేతలు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ లో ఆదివారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్ లో కేవలం యాభై ఒక శాతం మాత్రమే పోలింగ్ నమోదైనట్లు రాజకీయ విశ్లేషకులు తెలిపారు. ప్రధాన నగరాల్ లో ఓటింగ్ శాతం భారీగా పడిపోవడంపై అధికార కూటమి నేతలు తీవ్రంగా ఆరా తీస్తున్నట్లు సమాచారం. రెబల్ అభ్యర్థుల ప్రభావం, ఆర్నబ్ తుఫాను హెచ్చరికల కారణంగానే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు రాలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.