లండన్ థేమ్స్ నదిలో వినాయక నిమజ్జనంపై సోషల్ మీడియాలో చర్చ

రిపోర్టర్: మహేష్ స్థలం: లండన్

లండన్ లోని థేమ్స్ నదిలో వినాయక నిమజ్జనంపై భారతీయ మహిళ నీలాంజన హజారికా వర్మ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో తీవ్ర చర్చకు దారితీశాయని నెటిజన్లు తెలిపారు. విదేశాలలో మన సంస్కృతిని పాటించేటప్పుడు పర్యావరణాన్ని, స్థానిక నిబంధనలను గౌరవించాలని ఆమె వ్యంగ్యంగా వీడియోలో పేర్కొన్నారు. సంప్రదాయాల పేరుతో ప్రకృతిని కాలుష్యం చేయడం సరికాదని, బాధ్యతాయుతంగా వేడుకలు జరుపుకోవాలని పలువురు యూజర్లు అభిప్రాయపడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం అంతర్జాలంలో విపరీతంగా వైరల్ అవుతోంది.