నెల్లూరు జిల్లాలో యెర్రచందనం అక్రమ రవాణా జోరు

రిపోర్టర్: శివ స్థలం: నెల్లూరు

నెల్లూరు జిల్లా సరిహద్దు కొండల్లో ఎర్రచందనం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. శేషాచలగిరులను ఆనుకుని ఉన్న రాపూరు, చేజర్ల, కలువాయి ప్రాంతాల నుంచి స్మగ్లర్లు కూరగాయలు, ఉల్లిపాయల బస్తాల మాటున తమిళనాడు, బెంగళూరుకు దుంగలను తరలిస్తున్నారు. అటవీశాఖలో సిబ్బంది కొరత, తనిఖీల లోపం స్మగ్లర్లకు వరంలా మారుతోంది. కొత్త రేంజ్ అధికారి నియామకంతో నిఘా పెంచినా, పూర్తిస్థాయిలో కట్టడి చేయడానికి అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది.