ఢిల్లీలో మహిళల భద్రతపై మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీ ఆందోళన

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: ఢిల్లీ

ఢిల్లీలోని కల్కాజీ ఆలయం సమీపంలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై మాజీ ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో ఆకతాయిల బెడదపై ముందే ఫిర్యాదులు ఉన్నాయని, కాలేజీ విద్యార్థినులు కూడా ఇక్కడ భద్రత లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారని ఆమె గుర్తుచేశారు. మహిళల రక్షణ కోసం నిరంతర నేర నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.