డేవిడ్ రెడ్డి సినిమాలో పవర్ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ డ్రామా 'డేవిడ్ రెడ్డి' చిత్రంలో ప్రముఖ నటి రమ్యకృష్ణ కమలారెడ్డి అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో శివగామిని తలపించేలా అత్యంత శక్తివంతంగా, ఫీర్స్గా కనిపించారు. ఈ పీరియాడిక్ యాక్షన్ చిత్రంలో మరియా రియాబోషాప్కా హీరోయిన్ గా నటిస్తుండగా, సముద్రఖని, అభయ్ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.