గురుకులాల ఆహార సరఫరాలో రూ.900 కోట్ల కుంభకోణం జరుగుతోంది

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణలో గురుకుల విద్యార్థుల ఆహార సరఫరాలో రూ.900 కోట్ల టెండర్ల కుంభకోణం జరుగుతోందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖలో పూర్తిగా విఫలమయ్యారని, కమీషన్ల కోసం నాకాఫ్ అనే సంస్థకు నాసిరకం వస్తువులు సరఫరా చేసేలా టెండర్లు కట్టబెట్టారని మండిపడ్డారు. మార్క్‌ఫెడ్ బ్లాక్ లిస్ట్ చేసిన ఈ సంస్థ ద్వారా 15 లక్షల మంది విద్యార్థుల ఆరోగ్యంతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని విమర్శించారు.