హనుమకొండలో మత సామరస్యం చాటుతున్న ముస్లిం యువకులు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హనుమకొండ
హనుమకొండ నగరంలోని పెద్దమ్మగడ్డలో ముస్లిం యువకులు సొంత ఖర్చులతో వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఏడేళ్లుగా నవరాత్రి పూజలు నిర్వహిస్తూ మత సామరస్యాన్ని చాటుతున్నారు. క్రికెట్ కోచ్ మహమ్మద్ మోహిన్ ఆధ్వర్యంలో యూత్ అసోసియేషన్ సభ్యులు సయ్యద్ షకీల్, షేక్ అఫ్రోజ్, మహ్మద్ ఖాదర్ తదితరులు హిందూ సోదరులతో కలిసి ఈ ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.