తప్పుడు కథనాలపై వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ నోటీసులు జారీ

రిపోర్టర్: మహేష్ స్థలం: మంచిర్యాల

కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా దుష్ప్రచారం చేస్తున్న వెలుగు పత్రికకు లీగల్ నోటీసులు పంపినట్లు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ వెల్లడించారని బాల్క సుమన్ - మాజీ ఎమ్మెల్యే చెన్నూర్ తెలిపారు. అక్టోబర్ 17న ప్రచురించిన తప్పుడు కథనాన్ని ఇరవై నాలుగు గంటల్లో ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని అందులో డిమాండ్ చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ వివాదంపై పత్రిక యాజమాన్యం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.