అమరావతి సాహిత్య ఉత్సవం: మానవ భావోద్వేగాల పరిరక్షణలో సాహిత్యం కీలకం
రిపోర్టర్: రాజేష్
స్థలం: Vijayawada
మానవ భావోద్వేగాలను వ్యక్తీకరించడంలో మరియు సాంస్కృతిక సంప్రదాయాలను పరిరక్షించడంలో సాహిత్యం కీలక పాత్ర పోషిస్తుందని ప్రముఖ తెలుగు నటుడు బ్రహ్మానందం స్పష్టం చేశారు. ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో జరిగిన అమరావతి సాహిత్య ఉత్సవ ముగింపు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా తరాల వారసత్వాన్ని కాపాడటంలో పుస్తకాలు, కవిత్వం ఎప్పటికీ ప్రత్యేకమైనవేనని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.