తిరుమలలో అంగరంగ వైభవంగా జరిగిన శ్రీవారి గరుడసేవ
రిపోర్టర్: అశోక్
స్థలం: తిరుమల
తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శనివారం రాత్రి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. గరుడ వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. గజరాజులు, భజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ సాగిన స్వామివారి ఊరేగింపు భక్తిభావంతో సాగింది. ఈ వేడుకకు సుమారు మూడు లక్షల మంది భక్తులు తరలివచ్చినట్లు టీటీడీ అంచనా వేయగా, ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.