అమరావతి రాజధాని పిటిషన్లపై ఏపీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంలో మూడు రాజధానుల ఏర్పాటును సవాలు చేస్తూ దాఖలైన కొన్ని పిటిషన్లు నిరర్థకంగా మారాయని ఏపీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. పార్లమెంట్ ద్వారా అమరావతికి రాష్ట్ర రాజధానిగా చట్టబద్ధ గుర్తింపు లభించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేసినట్లు కోర్టు తెలిపింది. మిగిలిన పెండింగ్ వ్యాజ్యాల్లోని వివరాలను సమర్పించాలని న్యాయవాదులను ధర్మాసనం ఆదేశించింది. అమరావతి అభివృద్ధికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పులు, సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులను పరిగణలోకి తీసుకుంటూ ఈ తాజా పరిణామాలు చోటుచేసుకున్నాయి.