కృత్రిమ కాలు అందించి ఆటో కార్మికుడికి అండగా నిలిచిన పువ్వాడ ఫౌండేషన్
రిపోర్టర్: amudala Venkanna
స్థలం: ఖమ్మం
ఖమ్మంలో అనారోగ్యంతో కాలు కోల్పోయిన ఆటో కార్మికుడు రెపాకుల మహేష్‌కు పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృత్రిమ కాలు అందజేశారు. మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు సహకారంతో నాగ్‌పూర్ నుంచి కాలును తెప్పించారు. మమతా హాస్పిటల్ డైరెక్టర్ పువ్వాడ నరేన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏనుగు గాంధీ, ఆటో యూనియన్ అధ్యక్షులు ప్రతాపనేని ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.