ప్రతిష్ఠాత్మక యంగ్ సైంటిస్ట్ అవార్డును దక్కించుకున్న పార్వతీపురం ప్రొఫెసర్ ఝాన్సీరాణి

రిపోర్టర్: Alfa News Desk స్థలం: గరుగుబిల్లి

పార్వతీపురం ఉద్యాన కళాశాలలో ప్లాంట్ పాథాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ ఎన్. ఝాన్సీరాణికి ప్రతిష్ఠాత్మక యంగ్ సైంటిస్ట్ అవార్డు దక్కింది. సుస్థిర వ్యవసాయ రంగంలో జీవ ఆధారిత పరిష్కారాలపై చేసిన విశేష పరిశోధనలకు గుర్తింపుగా ఆసియన్ పీజీపీఆర్ సొసైటీ ఈ పురస్కారాన్ని అందజేసింది. గోవా రాష్ట్రంలోని పనాజీలో జరిగిన 9వ అంతర్జాతీయ సదస్సులో ఈ ఘనత సాధించారు.