క్రీడా రంగంలో అరుదైన గౌరవం: ఐఓఏ చైర్‌పర్సన్‌గా పీవీ సింధు ఎన్నిక
రిపోర్టర్: విజయ్
స్థలం: న్యూఢిల్లీ
భారత ఒలింపిక్ సంఘం అథ్లెట్స్ కమిషన్ చైర్‌పర్సన్‌గా రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని రిటర్నింగ్ అధికారి సంజయ్ కే శ్రీవాస్తవ వెల్లడించారు. వైస్ చైర్‌పర్సన్‌గా భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ ఎన్నికైనట్లు ఆయన తెలిపారు. అలాగే జనరల్ బాడీ అథ్లెట్ ప్రతినిధులుగా మీరాబాయి చాను, సాజన్ ప్రకాశ్ ఎంపికయ్యారని, వీరందరూ నామినేషన్లు ఒక్కటే దాఖలు కావడంతో ఏకగ్రీవ ఎన్నిక లాంఛనమైందని ఆయన స్పష్టం చేశారు.