ఒంగోలులో ఘనంగా ప్రపంచ తెలుగు మహాసభలు - బాలలు

రిపోర్టర్: గోపి స్థలం: ప్రకాశం

ఆంధ్ర ప్రదేశ్‌లోని ఒంగోలు నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో డిసెంబర్ 5, 6 తేదీలలో నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు - బాలలు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మహాసభల సందర్భంగా 16 ఏళ్ల లోపు బాలబాలికల కోసం కరోకే మాధ్యమం ద్వారా ‘పాడనా తెలుగు పాట’ పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్ 30 లోపు తమ ఎంట్రీలను పంపాలని కోరారు.