పాలమూరు జిల్లాకు సాగునీరు విడుదల చేసేందుకు కర్ణాటక అంగీకారం
రిపోర్టర్: మహేష్
స్థలం: మహబూబ్ నగర్
ఉమ్మడి పాలమూరు జిల్లాలో తీవ్ర నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని ఆల్మట్టి రిజర్వాయర్ నుండి జూరాలకు నీటిని విడుదల చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది. తెలంగాణ మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు నేతృత్వంలోని బృందం కర్ణాటకలో పర్యటించి ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. మంత్రుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన డీకే శివకుమార్, మానవతా దృక్పథంతో తక్షణమే నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.