కూటమిలో జనసేనకు న్యాయమైన సీట్లు కేటాయించాలని పవన్ కళ్యాణ్‌కు నేతల విజ్ఞప్తి
రిపోర్టర్: సత్యా
స్థలం: విజయనగరం
విజయనగరం స్థానిక ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా జనసేనకు దక్కాల్సిన సీట్లు ఇప్పించాలని ఆ పార్టీ నాయకులు గురాన అయ్యలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కోరారు. క్యాడర్ ఆత్మగౌరవం దెబ్బతినకుండా అధిష్టానం తగిన చర్యలు తీసుకోవాలని శనివారం ఆయన విజ్ఞప్తి చేశారు. జనసైనికుల అభిప్రాయాల మేరకే ఎన్నికల్లో పోటీపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.