కుప్పం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ప్రారంభం
రిపోర్టర్: రమేష్
స్థలం: చిత్తూరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. లబ్ధిదారులతో ముఖాముఖి మాట్లాడి, కుప్పం కొత్తపేటలో బహిరంగ సభలో ప్రసంగించారు. జాతీయ రహదారి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించడంతో పాటు రైల్వే స్టేషన్‌లో రైలు అదనపు హాల్ట్‌ను ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.