కారుణ్య నియామక ఉద్యోగిని వేతనంపై రాజస్థాన్ హైకోర్టు కీలక తీర్పు

రిపోర్టర్: నరేష్ స్థలం: అజ్మీర్

ఉద్యోగంలో ఉన్న భర్త మరణించడంతో కారుణ్య నియామకం ద్వారా ప్రభుత్వ ఉద్యోగం పొంది, ఆ తర్వాత అత్తమామలను ఆదుకోకుండా వేరుగా ఉంటున్న కోడలిపై రాజస్థాన్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఉద్యోగ బాధ్యతలు స్వీకరించే సమయంలో కుటుంబ సభ్యులను పోషిస్తానని ఆమె రాతపూర్వక హామీ ఇచ్చిందని గుర్తుచేసింది. కోడలు తన నెలవారీ వేతనంలో ఇరవై ఐదు శాతాన్ని వృద్ధురాలైన అత్తగారి బ్యాంకు ఖాతాకు నేరుగా జమ చేయాలని జస్టిస్ ఆనంద్ శర్మ స్పష్టం చేసినట్లు న్యాయవర్గాలు తెలిపాయి.