సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ హెచ్చరిక
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: నగరి
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగరి సీఐ మల్లికార్జునరావు సూచించారు. ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ డబ్బు కోల్పోయిన వెంటనే 1930 హెల్ప్లైన్కు కాల్ చేయాలని తెలిపారు. డిజిటల్ అరెస్టులు, నకిలీ ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీ వివరాలు ఎవరికీ చెప్పవద్దని ఆయన హెచ్చరించారు.