నందన్కానన్ పార్కులో ఒరాంగుటాన్ల సంరక్షణపై మంత్రి గణేష్ రాంసింగ్ ఖుంటియా ప్రకటన

రిపోర్టర్: గోపి స్థలం: భువనేశ్వర్

ఒడిశాలోని నందన్కానన్ బయోలాజికల్ పార్కులో అటవీశాఖ అధికారుల సంరక్షణలో ఉన్న ఒరాంగుటాన్ల ఆరోగ్యం మెరుగుపడుతోందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి గణేష్ రాంసింగ్ ఖుంటియా తెలిపారు. భువనేశ్వర్ సమీపంలోని ఈ పార్కులో వాటికి అనుకూల వాతావరణం లభిస్తోందన్నారు. ఒరాంగుటాన్లు ఏ దేశానికి చెందినవో గుర్తించేందుకు త్వరలోనే డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఇటీవల అటవీశాఖ అధికారులకు లభ్యమైన వీటిని ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి తగిన వసతులు కల్పిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.