రాజకీయ పార్టీ ప్రకటనపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన: తిరుపతిలో ప్రెస్మీట్

రిపోర్టర్: కిరణ్ స్థలం: Tirupati

నూతన రాజకీయ పార్టీని ప్రకటించే ముందు ప్రజల ఎజెండాగా పదిహేను అంశాలను వెల్లడించినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ నెల ఎనిమిదవ తేదీ గురువారం నాడు కలియుగ దైవమైన తిరుమలేశ్వరుని పాదాల వద్ద తిరుపతిలో తన నాల్గవ మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాయలసీమలో నెలకొన్న కరువు పరిస్థితులు, ఎల్నినో ప్రభావం, వలసలతో పాటు దేవుడంటే భక్తి లేని ఆ రెండు కుటుంబాల వ్యవహారంపై కీలక విషయాలు మాట్లాడనున్నట్లు స్పష్టం చేశారు.