మడ్డువలస జలాశయం ఏడు గేట్లు ఎత్తివేత

రిపోర్టర్: నరేష్ స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా వంగర మండలం మడ్డువలస జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వేగావతి, సువర్ణముఖీ నదుల ద్వారా ఇరవై ఎనిమిది వేల క్యూసెక్కుల నీరు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జలాశయం ఏడు ప్రధాన గేట్లు ఎత్తి ముప్పై వేల క్యూసెక్కుల నీటిని నాగావళి నదిలోకి విడుదల చేస్తున్నట్లు డీఈ అర్జున్ తెలిపారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం అరవై ఐదు మీటర్లు కాగా, ప్రస్తుతం అరవై నాలుగు పాయింట్ ఆరు మూడు మీటర్లుగా ఉందని ఆయన స్పష్టం చేశారు.