ట్రంప్కు ఇరాన్ హెచ్చరిక వీడియోలో బాలకృష్ణ భగవంత్ కేసరి ఫైట్

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: ఇంటర్నేషనల్

అమెరికా, ఇరాన్ మధ్య జరుగుతున్న సోషల్ మీడియా మీమ్స్ వార్లో టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా సన్నివేశం తెరపైకి వచ్చింది. జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను హెచ్చరిస్తూ బాలయ్య ఫైట్ సీన్ వీడియోను ట్వీట్ చేసింది. ఇరాన్ నిస్సహాయమైనది కాదని తెలియజేస్తూ హాలీవుడ్కు బదులు బాలీవుడ్ సినిమాలు చూస్తున్నారంటూ పేర్కొన్న ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.