ఈవీఎంల రద్దు కోరుతూ దేశవ్యాప్తంగా సేవ్ డెమొక్రసీ మార్చ్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: న్యూఢిల్లీ

దేశంలో ఓటర్ల జాబితా సవరణ అవకతవకలపై, ఎన్నికల సంఘం ఏకపక్ష ధోరణిపై ఇండియా కూటమి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్టోబర్ రెండు నుంచి ఎనిమిది వరకు దేశవ్యాప్తంగా సేవ్ డెమొక్రసీ మార్చ్ నిర్వహించనున్నట్లు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్లను పునరుద్ధరించాలని, సీఈసీ జ్ఞానేష్ కుమార్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అక్టోబర్ ఆరో తేదీన సీఈసీ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు తెలిపారు.