తీరానికి తీవ్ర తుఫాను ముప్పు: ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్న సీఎం చంద్రబాబు
రిపోర్టర్: వెంకట్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త తుఫాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారి బాపట్ల సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో సచివాలయంలో అత్యవసర సమీక్ష నిర్వహించిన సీఎం, సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తూ యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేశారు.