ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ ప్రమాదం
రిపోర్టర్: విజయ్
స్థలం: ఆదిలాబాద్
ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రి ఎస్‌ఎన్‌సీయూ వార్డులో షార్ట్ సర్క్యూట్ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదం కారణంగా వార్డులో నెలకొన్న దుస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అత్యంత కీలకమైన చిన్న పిల్లల ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని రోగుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు.