ఘాట్ రోడ్డుపై చిరుత సంచారం.. వణుకుతున్న వాహనదారులు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తిరుపతి
తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం చిట్వేలి-రాపూరు ఘాట్ రోడ్డులో చిరుత సంచారం కలకలం రేపింది. రక్షణ గోడపై కూర్చున్న చిరుతను ప్రయాణికులు కెమెరాలో బంధించారు. అటవీ ప్రాంతంలో చిరుతలు, పులి సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంటల తర్వాత ఘాట్ రోడ్డులో బైక్‌లను నిషేధించామని, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.