పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల ఓటర్ల నమోదు ప్రారంభం
రిపోర్టర్: గోపి
స్థలం: Hyderabad
మహబూబ్నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ మరియు వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల స్థానాలకు సంబంధించిన ఓటర్ల నమోదు ప్రక్రియ నేటి నుంచి అధికారికంగా ప్రారంభమవుతుందని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఎన్నికల సంఘం అవసరమైన నోటిఫికేషన్ను జారీ చేసిందని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసిందని తెలిపారు.