హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్‌లో మహిళపై హోంగార్డు అరాచకం

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: రంగారెడ్డి

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి పరిధిలోని హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలు ఏరుకునే మహిళపై హోంగార్డు జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం రాత్రి రైల్వే ట్రాక్ వెంట ప్లాస్టిక్ బాటిళ్లు సేకరిస్తున్న మహిళను హోంగార్డు దురుసుగా వ్యవహరిస్తూ దాడి చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, స్పందించిన సౌత్ సెంట్రల్ రైల్వే పోలీసులు విచారణ జరిపి సంబంధిత హోంగార్డుపై చర్యలకు సిఫారసు చేశారు.