కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలపై ప్రధాని ఆర్థిక సలహా మండలి కీలక నివేదిక
రిపోర్టర్: కృష్ణ
స్థలం: ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్‌లో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని ప్రధాని ఆర్థిక సలహా మండలి స్పష్టం చేసింది. ది ఘోస్ట్ ఆఫ్ పాపులేషన్ పాస్ట్ పేపర్‌లో ఏపీ పరిస్థితిని ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు పాతాళానికి పడిపోయిందని తెలిపింది. చిన్న కుటుంబం సామాజిక ధోరణిగా మారిన తరుణంలో, సంతానోత్పత్తి రేటును తిరిగి పెంచడం కష్టమని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ 2026ను తెచ్చిందని, శాశ్వత ఆపరేషన్ల ప్రోత్సాహకాలను రద్దు చేసి జననాల పెంపునకు చర్యలు చేపట్టిందని వివరించింది.