అనకాపల్లి ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం: అరబిందో పరిశ్రమలో చెలరేగిన మంటలు

రిపోర్టర్: గోపి స్థలం: అనకాపల్లి

అనకాపల్లి జిల్లా పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని అరబిందో ఫార్మా పరిశ్రమలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించిందని సీఐటీయూ నాయకులు గణిత సత్యనారాయణ తెలిపారు. యూనిట్-15 ప్రొడక్షన్ బ్లాక్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ప్రమాద వివరాలను యాజమాన్యం గోప్యంగా ఉంచడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని ఆయన వెల్లడించారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను పూర్తిగా అదుపులోకి తేవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.