మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మంత్రి నారా లోకేశ్ స్పందన: భారీ విజయం
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఈ గెలుపు కూటమి ప్రభుత్వ పాలనకు ప్రజలు అందించిన ఆశీర్వాదంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తమ ప్రధాన బాధ్యత అని చెప్పారు. గెలిచిన నేతలంతా రాజకీయాలకు అతీతంగా ప్రజాసేవకే అంకితం కావాలని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు మరింత కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు.