పండుగ సమయంలో గ్యాస్, ఎసిడిటీ సమస్యలకు డాక్టర్ అనుపమ కీలక సూచనలు

రిపోర్టర్: హరి స్థలం: Hyderabad

పండుగ వేళ పిండివంటలు, స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల జీర్ణవ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడి గ్యాస్, ఎసిడిటీ, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయని సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ అనుపమ ఎన్.కె తెలిపారు. అధిక కొవ్వు, చక్కెర పదార్థాలు జీర్ణక్రియను నెమ్మదించేలా చేసి పొట్టలో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతాయని ఆమె వెల్లడించారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం కోసం తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకోవాలని, మసాలాలు తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు.