ఎస్సీ, ఎస్టీ బాధితులకు రూ.15 కోట్ల పరిహారం విడుదల చేసిన సీఎం

రిపోర్టర్: కిరణ్ స్థలం: అమరావతి

అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన హైపవర్ కమిటీ సమావేశంలో ఎస్సీ, ఎస్టీల రక్షణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2023-26 మధ్య నమోదైన కేసుల్లో బాధితులకు రూ.15.43 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. అత్యాచార నిరోధక చట్టం అమలులో నాలుగు అంచెల కార్యాచరణను పటిష్టం చేయాలని, బాధితులకు న్యాయం అందించే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.