సీపీఎం కార్యకర్త కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించి ఆదుకున్న సర్పంచ్

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్ మండల పరిధిలోని పెద్దకొండూరు గ్రామంలో అనారోగ్యంతో మృతి చెందిన సీపీఎం పార్టీ సభ్యురాలు బత్తుల వెంకమ్మ కుటుంబానికి గ్రామ సర్పంచ్ గుండెబోయిన శిరీష ఇస్తారి యాదవ్ అండగా నిలిచారు. గురువారం వెంకమ్మ మృతి విషయం తెలుసుకున్న ఆమె మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు.