అర్నబ్ తుపాన్ వేళ ఏపీకి అండగా నిలుస్తామన్న తెలంగాణ ప్రభుత్వం

రిపోర్టర్: రమేష్ స్థలం: అమరావతి

అర్నబ్ తుపాన్ సమయంలో ఏపీకి అన్ని విధాలా అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికి ఫోన్ చేసి తుపాన్ తీవ్రత, జరిగిన నష్టంపై ఆరా తీసిన ఆయన, విద్యుత్ పునరుద్ధరణకు అవసరమైన సిబ్బందిని, సామగ్రిని పంపేందుకు సిద్ధమని తెలిపారు. కష్టకాలంలో మద్దతు తెలిపిన తెలంగాణ ప్రభుత్వానికి గొట్టిపాటి రవి ధన్యవాదాలు తెలిపారు.