బాపట్ల జిల్లాలో మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్ సేవలు ప్రారంభం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: బాపట్ల

బాపట్ల జిల్లాలో నేరస్థలంలో శాస్త్రీయ ఆధారాల సేకరణ కోసం మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్ వాహన సేవలను ప్రారంభించారు. దర్యాప్తులో సాంకేతికతకు పెద్దపీట వేయడం ద్వారా కేసుల దర్యాప్తు వేగవంతం కావడానికి ఈ యూనిట్ ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు వెల్లడించారు.